పట్టాలపైకి తొలి సూపర్ ఫాస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు...
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: దేశంలో తొలిసారిగా సూపర్ ఫాస్ట్ ఏసీ డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్-ముంబైల మధ్య నడిచే ఈ రైలును రైల్వేశాఖ సహాయమంత్రి భరత్‌సిన్హ్ సోలంకి కాలుపూర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 1,500 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. అహ్మదాబాద్ నుంచి ముంబై సెంట్రల్ (500 కి.మీ. దూరం) వెళ్లేందుకు 7 గంటల సమయం పడుతుంది. రైలులో ఆధునిక వసతులతోపాటు సౌకర్యంగా ప్రయాణించేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నట్లు సోలంకి చెప్పారు. కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు మెరుగైన పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు పశ్చిమ రైల్వే వివరించింది.

Comments