ఈటీవి సుమన్ కన్నుమూత..
హైదరాబాద్,సెప్టెంబర్ 7: ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు రెండవ కుమారుడు, ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ సుమన్ అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 45 సంవత్సరాలు. సమన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1966 డిసెంబరులో జన్మించిన సుమన్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఈటీవీ టెలీ ఫిలింస్ లో నటించారు. కొన్ని మెగా సీరియల్స్ కు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

Comments