ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ మృతి
రాయ్‌పూర్ ,సెప్టెంబర్ 15: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ కెఎస్ సుదర్శన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు. 1954 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్‌లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2000 - 2009 మధ్య ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్డియే ప్రభుత్వ హయాంలో ఆయన వాజ్‌పేయి, అద్వానీలకు కీలక సూచనలు చేశారు. 2009 మార్చి 31వ తేదీన ఆయన ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.
Comments