
తిరుపతి:,సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ఆరంభమైయ్యాయి. ధ్వజారోహణతో ఆరంభమైన బ్రహ్మోత్సావాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హాజరైన సీఎం కిరణ్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి రోజు వేడుకల్లో పాల్గొన్నారు.సాయంత్రం ఆలయ ధ్వజపఠం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి శేష వాహనంతో మొదలై వరుసగా 26వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
Comments