యూపీఏతో తృణమూల్ కటీఫ్...
కోల్‌కతా,సెప్టెంబర్ 18: కేంద్రం లోని యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైదొలగింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాళ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ ప్రకటన విడుదల చేశారు. యూపీఏ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు కారణంగా తాను పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తృణముల్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మిత్రపక్షమైన తమను ఎప్పుడూ ప్రబుత్వం సంప్రదించలేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పెంచినప్పుడు కూడా తమను సంప్రదించకపోవటంపై మమతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ మంత్రులు శుక్రవారం రాజీనామా చేస్తారని మమత తెలిపారు.

Comments