ఆఫ్ఘన్ పై భారత్ గెలుపు...
కొలంబో,సెప్టెంబర్ 19: టి20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 159 పరుగులు చేయగా... అనంతరం అఫ్ఘాన్ 19.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ధాటిగా ఆడిన మొహమ్మద్ నబీ (17 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ (3/24) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నిలువరించాడు. బాలాజీ (3/19), అశ్విన్ (2/20) రాణించారు. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
Comments