' చిరు' పదవే నా...?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: యూపిఏ ప్రభుత్వం నుంచి తృణమూల్ వైదొలగడంతో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ సారి మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లేదా నలుగురు పార్లమెంటు సభ్యులను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఊహాగనాలు సాగుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవికి ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అలాగే ఒకటో రెండో పదవులు తెలంగాణ ప్రాంత ఎంపీలకు ఇవ్వాలని కూడా అధిష్టానం యోచిస్తోందని సమాచారం. అయితే ఇంతా చేసి చిరుకు దక్కేది సహాయ మంత్రి పదవేనేమో అనే పెదవి విరుపులూ వినిపిస్తున్నాయి. మరో వైపు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు మంత్రి పదవులకు ఒప్పుకుంటారా అనేది ఇంకో ప్రశ్న.
Comments