యు.ఎస్.లో మరో తెలుగబ్బాయి దుర్మరణం...
న్యూయార్క్, సెప్టెంబర్ 3: అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పడపాటి రాజాచౌదరి ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృతి చెందాడు.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాజా చౌదరి (25) న్యూయార్క్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం సహచర మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రాజా ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృత్యువాతపడ్డారు.
Comments