వర్షం వల్ల భారత్-కివీస్ తొలి ట్వంటీ 20 మ్యాచ్ రద్దు
విశాఖపట్నం,సెప్టెంబర్ 8: భారత్-కివీస్‌ల మధ్య ఇక్కడి వైఎస్సార్ స్టేడియంలోశనివారం జరగాల్సిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన అభిమానులు నిరాశ చెందారు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉన్న భారత జట్టులోకి కేన్సర్ ట్రీట్‌మెంట్ అనంతరం యువరాజ్ తిరిగి చేరడంతో అభిమానులు ఈ మ్యాచ్ పై ఆసక్తిని కనబరిచారు.
Comments