నిరాశా నిస్పృహలో రాయపాటి
గుంటూరు,సెప్టెంబర్ 1: గుంటూరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబ
శివ రవు తమ కాంగ్రెసు పార్టీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు
పార్టీని ఆ భగవంతుడే కాపాడాలని ఆయన అన్నారు. పార్టీ భవిష్యత్ పై కాంగ్రెసు
అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళనలో ఉన్నారని ఆయన
అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రానని, త్వరలో రాజకీయ సన్యాసం
గురించి వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 2014 వరకు ప్రభుత్వాన్ని
నడిపించడానికి కాంగ్రెసు పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చునని
ఆయన అన్నారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు చేసినా గుర్తింపు లభించడం
లేదని రాయపాటి చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తాజాగ ఆయన తిరుమల తిరుపతి
దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని ఆశించి భంగపడినట్లు భోగట్టా. స్వంత
గుంటూరు జిల్లాలో కూడా ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవని చెబుతారు. మంత్రి
కన్నా లక్ష్మినారాయణ ఆధిపత్యం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు
చెబుతున్నారు. ఇరువురికి మధ్య బహిరంగ వాగ్యుద్ధం చెలరేగిన సందర్భాలు కూడా
ఉన్నాయి.

Comments