హిందూ మాజీ ఎడిటర్ జి. కస్తూరి మృతి
చెన్నై, సెప్టెంబర్ 21: ది హిందూ ఆంగ్ల దినపత్రిక మాజీ సంపాదకుడు జి. కస్తూరి (87) శుక్రవారం మృతి చెందారు. హిందూ పత్రికకు జి. కస్తూరి 1965 నుంచి 1991 వరకూ సంపాదకుడిగా సేవలు అందించారు. హిందూ పత్రిక అభివృద్ధితో పాటు, పత్రిక ఆధునీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. జర్నలిజంలో మౌలిక విలువలను కాపాడుతూనే ఆయన ఈ సంస్కరణలు ప్రవేశ పెట్టారు.

Comments