
వాషింగ్టన్ ,సెప్టెంబర్ 7: డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా బరాక్ ఒబామా నామినేషన్ స్వీకరించారు. తమకూ, రిపబ్లికన్ల విధానాలకు మధ్య ఉన్న తేడాలను ని అధ్యయనం చేసి ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. తనను మళ్ళీ గెలిపిస్తే ఆర్థిక వ్యవస్థను చక్కబెడతానని, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీల వర్షం కురిపించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఒబామా తెలిపారు. అల్‌ఖైదా పూర్తిగా అంతమైపోవచ్చిందని, 2014 కల్లా ఆఫ్ఘనిస్థాన్‌లో తమ మిషన్ పూర్తవుతుందని ఒబామా చెప్పారు. నవంబర్ ఆరున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Comments