లోకేష్ రాజకీయ చిలకపలుకులు...
హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై చాలారోజులుగా తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ తొలిసారి రాజకీయాలపై స్పందించారు. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఓ కార్యక్రమానికి హాజరైన లోకేష్-- 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని అన్నారు. తాను పార్టీలో సాధారణ కార్యకర్తలాగే కొనసాగుతానని చెప్పారు.తండ్రి, చంద్రబాబు నాయుడు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ఢీకొట్టే సత్తా కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. బెదిరింపు రాజకీయాలకు టిడిపి భయపడదన్నారు. ఇతర పార్టీలు ప్రజారాజ్యం పార్టీలాగా కాంగ్రెసు పార్టీలో విలీనం కావాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.

Comments