సూర్య కిరణ్-2లో సైనా నెహ్వాల్
హైదరాబాద్,సెప్టెంబర్ 27: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జెట్ ఫైటర్ విమానం సూర్య కిరణ్-2లో విహరించింది. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన క్రికటేతర క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఖ్యాతికెక్కింది. లండన్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకం సాధించినందుకు గాను సైనాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అరుదైన అవకాశం కల్పించింది. క్స్

Comments