39 మందితో కొత్త మంత్రివర్గం: ఆదిలాబాద్ కు దక్కని చోటు
హైదరాబాద్,డిసెంబర్ 1: రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో మొత్తం 39 మందికి చోటు లభించింది. సీఎం కార్యదర్శి జవహర్ రెడ్డి స్వయంగా మంత్రివర్గ జాబితాను బుధవారం తెల్లవారు జామున గవర్నర్‌కు అందించారు. కిర ణ్ మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రులు జానారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డిలకు పదవులు దక్కాయి. అలాగే చాలావరకూ తాజామాజీ మంత్రులను కొనసాగించారు. జిల్లాల వారీగా... కిరణ్ మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఎమ్మెల్యేలు ... హైదరాబాద్: దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, శంకర్‌రావు రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి మెదక్: గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరీంనగర్: శ్రీధర్‌బాబు వరంగల్: బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య నిజామాబాద్: సుదర్శన్‌రెడ్డి ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్: జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం లభించలేదు. గుంటూరు: మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి పశ్చిమగోదావరి: పీతాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్ తూర్పు గోదావర...