రంజీ లో త్రిపురపై హైదరాబాద్ గెలుపు
హైదరాబాద్,నవంబర్ 19: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. జింఖానా మైదానంలో మూడు రోజులకే ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 35 పరుగుల తేడాతో త్రిపురను ఓడించింది. గత మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న జట్టు ఈ సారి గెలుపును అందుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు వెనుకబడిన త్రిపుర, రెండో ఇన్నింగ్స్‌లో రవితేజ (5/20) బౌలింగ్ ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో హైదరాబాద్‌కు బోనస్ పాయింట్ సహా 6 పాయింట్లు దక్కాయి. ఈ రంజీ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అవమానకర ఆటతీరుతో 21 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైన హైదరాబాద్, జార్ఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. డిసెంబర్ ఒకటి నుంచి జరిగే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, గోవాను ఢీకొంటుంది.
Comments