శ్రీలంక అధ్యక్షునిగా రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టిన రాజపక్స
కొలంబో,నవంబర్ 19: శ్రీలంక అధ్యక్షునిగా మహీంద రాజపక్స రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష సచివాలయం ఎదురుగా ఉన్న సముద్రతీరంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. త్రివిధ దళాల కవాతు, 21 తుపాకుల వందనంతో జరిగిన ఈ కార్యక్రమంలో లంక ప్రధాన న్యాయమూర్తి అశోక డిసిల్వా రాజపక్స చేత ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం కోసం విపరీతంగా ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపిస్తూ విపక్షాలు యూఎన్‌పీ, జేవీపీలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 2005 నవంబర్‌లో మొదటిసారి అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన రాజపక్స రెండోసారి ఆ పదవిని చేపట్టడం కోసం రాజ్యాంగాన్ని సవరించారు.
Comments