దలైలామాకు జామియా మిలియా గౌరవ డాక్టరేట్
న్యూఢిల్లీ,నవంబర్ 22: టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామాను ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (హానరీస్ కాసా)తో సత్కరించనుంది. మంగళవారం జరిగే విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో దలైలామాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించనున్నట్టు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబాల్ అధ్యక్షత వహిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నజీబ్ జంగ్ అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 147 మందికి బంగారు పతకాలు, 127 మందికి పిహెచ్‌డీ డిగ్రిలను ప్రదానం చేస్తారు.
Comments