ఆస్ట్రేలియా చదువులు మాకొద్దు...
న్యూఢిల్లీ,నవంబర్ 27: ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న జాతివివక్ష దాడుల కారణంగా గత ఏడాది వ్యవధిలో 30 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరుగుముఖం పట్టారని అక్కడి భారత విద్యార్థుల సమాఖ్య(ఫిసా) తెలిపింది. దాడులకుతోడు వీసా నిబంధనల కఠినతరం, శాశ్వత నివాసానికి ప్రభుత్వ అనుమతి నిరాకరణ కూడా ఇందుకు కారణమని మెల్‌బోర్న్ నుంచి వెలువడే ‘ఇండియన్ స్టూడెంట్’ మ్యాగజైన్ కథనాన్ని ఉటంకిస్తూ ఫిసా తెలిపింది.
Comments