'గుజారిష్' కు సూపర్ హిట్ టాక్
హైదరాబాద్,నవంబర్ 20: ఐశ్వర్యరాయ్, హృతిక్‌రోషన్ జంటగా నటించిన 'గుజారిష్' చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించింది. ‘పెరాప్లెజియ’పేషంట్ గా హృతిక్, అతనికి సపర్య చేసే వివాహిత నర్సు పాత్రలో ఐశ్వర్య అవధుల మేరకు నటించారు. వీరి మధ్య ప్రేమ, వారి మధ్యలో ఒమర్ సిద్ధికి అనే పాత్ర , ఈ ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులేమిటి? అనేది ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఐశ్వర్యరాయ్, హృతిక్‌రోషన్‌లు ఇద్దరూ పోటీపడి డీగ్లామరైజ్ పాత్రల్లో తమ నట విశ్వరూపాన్ని చూపారు.ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అందించారు. కాగా, 2004 లో వచ్చిన స్పానిష్ చిత్రం 'ది సీ ఇన్సైడ్', 1996 లో ఆస్కార్ పొందిన 'ది ఇంగ్లీష్ పేషంట్' చిత్రాలను ఈ చిత్రం గుర్తుకు తెస్తుంది.

Comments