నాగపూర్ టెస్ట్; కివీస్ 148/7
నాగపూర్,నవంబర్ 20: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్ 34, సౌథీ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మెకింతోష్ 4, గుప్తిల్ 6, టేలర్ 20, వెటోరి 3, రైడర్ 59, హప్కిన్స్ 7 పరుగులు చేసి అవుటయ్యారు. విలియమ్‌సన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. భారత బౌలర్లలో శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ఓజా రెండేసి వికెట్లు తీశారు. హర్భజన్‌కు ఒక వికెట్ దక్కింది. వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమయింది.
Comments