సింగిల్స్ లోనూ సోమ్ దేవ్ కు స్వర్ణం
గ్వాంగ్‌జౌ,నవంబర్ 23: ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ అసాధారణ ప్రతిభతో రెండో పసిడి పతకాన్ని సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో సోమ్ దేవ్ ఉజ్బెకిస్తాన్ కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ ను 6-1, 6-2 స్కోరుతో ఓడించి స్వర్ణ పతకం సాధించాడు. డబుల్స్ ఈవెంట్ లో సోమ్ దేవ్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఇప్పటి వరకు టెన్నిస్ లో మూడు కాంస్య పతకాలు సాధించింది. ఇక హకీ సెమీఫైనల్స్ లో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో భారత్ పై మలేషియా విజయం సాధించింది. కాంస్య పతకం కోసం భారత జట్టు దక్షిణకొరియా జట్టుతో తలపడనుంది.
Comments