మంత్రివర్గంలో చిరు చేరిక ఖాయం?
న్యూఢిల్లీ,నవంబర్ 27: ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఫోన్ చేశారు. మంత్రివర్గంలో ప్రజారాజ్యం చేరే విషయంపై వీరివురూ చర్చించినట్టు తెలిసింది. సీఎంతో సంభాషణ అనంతరం అందుబాటులో వున్న సహచరులతో చిరంజీవి సమాలోచనలు ప్రారంభించారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవితో సీఎం భేటి కానున్నారు.మంత్రివర్గం తొలి జాబితాలో 30 నుంచి 35 మంది వరకు చోటు కల్పించేఅవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూర్తిగా కాంగ్రెస్ వారే ఉన్నారు. తరువాత జగన్ వ్యహారం ఎలా ఉంటుందో చూసి పిఆర్పీ మద్దతు అవసరమైన పక్షంలో వారితో మంత్రి వర్గాన్ని విస్తరించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండవ జాబితాలో పిఆర్పీతో పాటు మరి కొందరు కాంగ్రెస్ వారిని కలుపుకుని మొత్తం 10 మందికి అవకాశం కల్పి స్తారని సమాచారం.

Comments