భారత్ కు 373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత
నాగపూర్,నవంబర్ 22: : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడవ టెస్ట్ లో ఆదివారం మూడవ రోజున భారత్ 8 వికెట్లు నష్టానికి 566 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనితో భారత్ కు 373 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యత లభంచింది. ద్రావిడ్ 191, ధోనీ 98, గంభీర్ 78, సెహ్వాగ్ 74, సచిన్ 61, హర్బజన్ సింగ్ 20, లక్ష్మణ్ 12, రైనా 3 పరుగులు చేశారు. శర్మ ఏడు పరుగులు చేసి, శ్రీనాధ్ పరుగులు ఏమీలేకుండా నాటౌట్ గా నిలిచాడు. కాగా, ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
Comments