‘సాక్షి’ చానెల్ కథనంపై నివేదిక కోరిన ఎ.ఐ.సి.సి.
న్యూఢిల్లీ,నవంబర్ 21: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పై ‘సాక్షి’ చానెల్‌లో వచ్చిన కథనంపై నివేదిక పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఎ.ఐ.సి.సి. ఆదేశించింది. పీసీసీ నుంచి నివేదిక వచ్చాక ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ చెప్పారు. కాగా, ‘సాక్షి టీవీ’లో వచ్చిన కథనంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ చెప్పారు. ఆ కథనాన్ని తాను చూడలేదని, తనకు ఆ విషయమే తెలియదని ఆయన అన్నారు.
Comments