ఇదేగా కాంగ్రెస్ సంస్కృతి ...చంద్రబాబు
హైదరాబాద్,నవంబర్ 24: ముఖ్యమంత్రులను తరచూ మార్చే సంస్కృతి కాంగ్రెస్‌దేనని.. అవినీతి, అక్రమాలలో ఆ పార్టీకి సాటి ఏదీ లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. సీఎంలను మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల నింద తొలగిపోదన్న విషయం ప్రజలు గమనిస్తున్నారని ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో అన్నారు. రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ భూస్థాపితమవుతోందని, బీహార్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మలని , సోనియాగాంధీ ఎదుట తోకాడించడం మినహా రాష్ట్ర సమస్యల సాధనకు ఏమీ చేయడం లేదన్నారు.
Comments