
గాంగ్'జౌ,నవంబర్ 22: : ఆసియా క్రీడలలో టెన్సీస్ పురుషుల డబుల్స్ లో భారత్ కు బంగారు పతకం లభించింది. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-సనమ్ సింగ్ జోడి విజేతగా నిలిచి భారత్ ఖాతాలో ఆరో స్వర్ణాన్ని జమచేశారు. . ఇది భారత్ కు లభించిన ఆరో స్వర్ణపతకం. డబుల్స్‌లో పసిడి నెగ్గిన సోమ్‌దేవ్ సింగిల్స్ సెమీఫైనల్లో 6-2, 0-6, 6-3తో తాతాసుమ ఇటో (జపాన్)పై గెలుపొంది ఆసియా క్రీడల టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. కాగా టెన్సీస్ మిక్స్'డ్ డబుల్స్ లో సానియా జోడీకి రజత పతకం లభించింది. పురుషుల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ, మంగళ్ సింగ్ చంపియాలతో కూడిన భారత జట్టు కాంస్యం సాధించింది.
Comments