ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకారం
హైదరాబాద్,నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 16వ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.,ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, కేవీపీ, కేశవరావు, సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కిరణ్‌కుమార్‌రెడ్డి తల్లి సరోజనమ్మ, సతీమణి, బంధువులు, కాంగ్రెస్ నేతలు హాజరు అయ్యారు.
Comments