తొలి వన్ డే లో భారత్ గెలుపు
గువాహతి,నవంబర్ 28: న్యూజిలాండ్‌తో ఆదివారమిక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 236 పరుగులకే కట్టడి చేసి భారత్ విజయాన్ని అందుకుంది. కివీస్ 45.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటయింది. హౌ 9, గుప్తిల్ 30, విలియమ్‌సన్ 25, స్టైరిస్ 10, ఇలియట్ 5, టఫీ 4, టేలర్ 66, హాప్కిన్స్ 16, మెక్‌కల్లమ్ 35, మిల్స్ 32 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో యువరాజ్, శ్రీశాంత్, అశ్విన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. నెహ్రాకు ఒక వికెట్ దక్కింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటయింది. విరాట్ కొహ్లి (105) సెంచరీతో రాణించాడు. యువరాజ్ సింగ్42, గంభీర్ 38 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మెక్‌కే 4, మిల్స్ 3, టఫీ 2 వికెట్లు పడగొట్టారు.
Comments