మార్చి 7 నుంచి ఇంటర్,24 నుంచి ఎస్.ఎస్.సి. పరీక్షలు
హైదరాబాద్ ,నవంబర్ 20: ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలకు పరీక్షలు జరుగుతాయి. కాగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది.
Comments