
హైదరాబాద్: దర్శకరత్న డా.దాసరి నారాయణరావు అందిస్తున్న మరో ‘బొబ్బిలిపులి’ లాంటి సంచలన చిత్రం ‘పరమవీరచక్ర’ లో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్యున్నారు. ఒకరు మిలటరీ మేజర్ అయితే.... వేరొకరు సినీ సూపర్‌స్టార్. ఏ మాత్రం పొంతన లేని ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి ఈ రెండు పాత్రలను ‘పరమవీరచక్ర’ చిత్రంలో చేస్తున్నారు బాలకృష్ణ. అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. తన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’లో యాక్షన్‌తోపాటు కామెడీకి కూడా పెద్ద పీట వేస్తున్నారు దర్శకరత్న. అలీ, బ్రహ్మానందం, హేమలపై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయంటున్నారు. ఇందులో అలీ రోబో గా కనిపిస్తారు.
Comments