జార్ఖండ్ గృహిణికి కేబీసీలో రూ. కోటి
న్యూఢిల్లీ,నవంబర్ 20: కౌన్ బనేగా కరోడ్‌పతి-4లో జార్ఖండ్‌కు చెందిన రాహత్ తస్నీమ్(37) కోటి రూపాయలు గెలుచుకున్నారు. మధ్యతరగతి గృహిణి రాహత్ తస్నీమ్ 'ఆఫ్రికాలోని ఓ దేశపు ప్రథమ అధ్యక్షురాలు ఏ ప్రాంతానికి చెందిన వారు?' అనే ప్రశ్నకు ‘డబుల్ డిప్’ అవకాశం ఉపయోగించుకొని ఆమె ఆ మొత్తాన్ని సొంతం చేసుకున్నారు. ‘ఈ షోలో మొదట చాలా కంగారుపడ్డా. అందుకే వెంటనే లైఫ్‌లైన్లను ఉపయోగించుకున్నా. అయితే రూ. 3.2 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన జవాబులు సరైనవని ముందే ఊహించా. రూ. ఐదు కోట్ల జాక్‌పాట్ ప్రశ్నకు జవాబు తెలియకపోవడం, లైఫ్‌లైన్లు కూడా లేకపోవడంతో గేమ్ నుంచి విరమించుకున్నా’ అని తస్నీమ్ చెప్పారు.
Comments