సచిన్ వర్సెస్ ముత్తయ్య మురళీథరన్ వీడ్కోలు పోరు !
ముంబై,మార్చి 31: ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో సచిన్ టెండూల్కర్ దిగ్గజమైతే, బౌలింగులో అంతే కీర్తిని లంక బౌలర్ మురళీథరన్ కూడగట్టుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్యాటింగులో దాదాపుగా అన్ని రికార్డులూ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 464 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాడు దిల్షాన్ మాత్రమే అతని కన్నా ఎక్కువ 467 పరుగులు చేశాడు.మురళీథరన్ టెస్టు మ్యాచుల్లో 800 వికెట్లు , వన్డే మ్యాచుల్లో 534 వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా మురళీథరన్ చరిత్ర సృష్టించాడు.ముంబైలో శనివారంనాడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్స్ సందర్భంగా ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంటోంది. సచిన్ టెండూల్కర్ కోసం భారత్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవాలనే పట్టుదలతో ఉండగా, మురళీథరన్ కోసం ఫైనల్లో విజయం సాధించాలనే దీక్షతో శ్రీలంక ఉంది. వచ్చే నెలలో 38వ ఏట అడుగిడుతున్న సచిన్ మరో ప్రపంచ కప్ పోటీలో ఆడే అవకాశాలు లేవు. అలాగేవచ్చే నెలలోనే మురళీ...