కాంగ్రెస్ - టీఆర్‌ఎస్ విలీనం వార్తలను ఖండించిన కేసీఆర్
హైదరాబాద్,మార్చి 22 : కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీన వార్తలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అవుతోందని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దంటూ కేసీఆర్ మీడియా విజ్ఞప్తి చేశారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జూన్‌లో ప్రకటన చేస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు హామీ ఇచ్చినట్లు అంతకుముందు వార్తలు వచ్చాయి. సోనియా ఇచ్చిన హామీపై పార్టీలో విస్తృతమైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కూడా సోనియా చెప్పినట్లు తెలుస్తోంది.
Comments