రాజినామా బాటలో తెలంగాణ మంత్రులు
హైదరాబాద్,మార్చి 5: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. శనివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం లో ఈ నెల 12వ తేదీ వరకు శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ నెల 12 లోపే ఢిల్లీ వెళ్లాలని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే సోనియా గాంధీ ముందే మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
Comments