జింబాబ్వే పై శ్రీలంక గెలుపు
క్యాండీ (శ్రీలంక),మార్చి 11: గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 139 పరుగుల తేడాతో జింబాబ్వే పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్ (131 బంతుల్లో 144; ఫోర్లు 16, సిక్స్ 1), ఉపుల్ తరంగ (141 బంతుల్లో 133; ఫోర్లు 17) సెంచరీలతో హోరెత్తించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఆరంభంలో లంకను బెదరగొట్టింది. ఓపెనర్ బ్రెండన్ టేలర్ (72 బంతుల్లో 80; ఫోర్లు 9, సిక్స్ 1) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ ఇతరులు రాణించలేదు. ఫలితంగా 188 పరుగులకే ఆలౌటయ్యింది. బౌలింగ్‌లోనూ సత్తా చాటుకుని కేవలం మూడు ఓవర్లలో నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు తీసిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Comments