వరల్డ్‌కప్: ఇంగ్లాండ్ ఆశలు సజీవం
చెన్నై,మార్చి 18: వరల్డ్‌కప్ 2011 లో భాగంగా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి టోర్నీలో ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం ఇక్కడ విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 18 పరుగుల తేడాతో గెలుపొందిఇంది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ తమ లీగ్ మ్యాచ్‌లు ఆరింటిని ముగించుకుని ఏడు పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, విండీస్‌లపై గెలవగా,ఇండియాతో జరిగిన మ్యాచ్‌ను టై చేసుకుంది.
Comments