కెనడాపై ఆసీస్ గెలుపు
బెంగళూరు,మార్చి 17: వరల్డ్‌కప్‌లో ఆసీస్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఇక్కడ కెనడాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఏడు వికెట్లతేడాతో గెలుపొంది ఘన విజయాన్ని నమోదు చేసింది. కెనడా తమ ముఇనుంచిన 212 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. ఆసీస్ ఓపెనర్లు వాట్సన్, హడ్డిన్ తమ దైన శైలిలో విజృంభించి ఆసీస్ గెలుపును సులభం చేశారు. వాట్సన్ 94 పరుగులు చేసి..తృటిలో సెంచరీ కోల్పోగా, హడ్డిన్ 88 పరుగులతో వాట్సన్‌కు చక్కటి సహకారాన్నందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన డా తొలి 10 ఓవర్లలో ఒక వికెట్టు నష్టానికి 77 పరుగులు చేసి పరుగుల వరద సృష్టించింది. కానీ ఇప్పటికీ గ్రూప్-ఎ నుంచి క్వార్టర్స్కు చేరిన ఆసీస్‌కు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా విజయా న్ని చేజిక్కుంచుకుంది. కెనడా బౌలర్లలో ఒసినైడ్, బైడ్‌వాన్, డెవ్‌సన్ తలో వికెట్ తీశారు.
Comments