కాంగ్రెస్ , తృణమూల్ సీట్ల సర్ధుబాటు
కోల్'కతా,మార్చి 21: పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య శాసనసభ ఎన్నికల సీట్ల సర్ధుబాటు కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి 65 స్థానాలు కేటాయించడానికి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ అంగీకరించారు. 229 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ మొదట 90 సీట్లకు డిమాండ్ చేసింది. అయితే మమతా బెనర్జీ అంగీకరించలేదు. సోమవారం నాడు సోనియాతో ఈ అంశపై చర్చించిన తర్వాత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ టెలిఫోన్ లో మమతా బెనర్జీ తో మాట్లాడి 65 సీట్లకు ఒప్పందం ఖరారు చేశారు.

Comments