పార్టీ పేరును ప్రకటించిన జగన్
హైదరాబాద్,మార్చి 11: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా నామకరణం చేస్తున్నట్లు జగ్గంపేట బహిరంగ సభలో వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2.29 నిమిషాలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ప్లీనరీ నిర్వహించి పార్టీ విధివిధానాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రతి పేదవాడికీ సంతోషాన్ని ఇచ్చే పార్టీ 'వైఎస్సాఆర్ పార్టీ’ అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Comments