దటీజ్ దక్షిణాఫ్రికా...!
నాగపూర్,మార్చి 13: ప్రపంచకప్‌లో భాగంగా శనివారమిక్కడ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ పై విజయయం సాధించి గ్రూప్ 'బి ' లో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటయింది. ఒక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిన టీమిండియాకు పదునైన బౌలింగ్‌తో సఫారీలు కళ్లెం వేశారు. 30 పరుగుల తేడాతో 8 వికెట్లు పడగొట్టారు. సచిన్ 111, సెహ్వాగ్ 73, గంభీర్ 69 మాత్రమే రాణించారు. యువరాజ్ 12, కొహ్లి1, హర్భజన్ 3 పరుగులు చేసి అవుటయ్యారు. పఠాన్, జహీర్‌ఖాన్, నెహ్రా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ధోనీ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్ 5, పీటర్‌సన్ 2 వికెట్లు పడగొట్టాడు. మోర్కల్, ప్లెసిస్, కల్లిస్ తలో వికెట్ తీశారు. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ ల నష్టం తో లక్ష్యాన్ని చేధించింది. ఈ ప్రపంచకప్‌లో ఇది భారత్ కు తొలి వోటమి.
Comments