శిరీష్ భరద్వాజ్‌కు బెయిల్ నిరాకరణ
హైదరాబాద్,మార్చి 24: చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. అతడి తల్లి సూర్యమంగళకు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారని శిరీష్ భార్య, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈనెల 14న కేసు పెట్టారు. అప్పటినుంచి శిరీష్, అతడి తల్లి కనిపించకుండా పోయారు. ముందస్తు బెయిల్ కోసం శిరీష్ పెట్టుకున్న అభ్యర్థనను 8వ అడిషినల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో శిరీష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments