సారీ...సైనా...
బర్మింగ్‌హామ్,మార్చి 13: : ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌కు మరోసారి చుక్కెదురైంది. అనేకమంది అగ్రశ్రేణి షట్లర్లు ఈ టోర్నీకి దూరం కావటంతో టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపించినా... క్వార్టర్స్‌లోనే సైనా పరాజయం పాలైంది. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎరికో హిరోసీ (జపాన్) 21-11, 22-20 స్కోరుతో సైనాపై విజయం సాధిం చింది. గత ఏడాది ఈ టోర్నీలో సెమీస్ చేరిన సైనా ఈ సారి క్వార్టర్స్ లోనే ఇంటిముఖం పట్టింది.

Comments