కెన్యాపై కెనడా గెలుపు
న్యూఢిల్లీ, మార్చి ౭: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారమిక్కడ జరిగిన 23వ లీగ్ మ్యాచ్‌లో కెన్యాపై కెనడా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు అందుకుంది. కెన్యాపై విజయంతో కెనడా ఈ ప్రపంచకప్‌లో బోణి కొట్టింది. హాన్సరా (70), బాగాయ్ (64) అర్థ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కెన్యా 50 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటయింది.
Comments