కొలంబో మ్యాచ్ కి వర్షం అడ్డంకి
కొలంబో,మార్చి 5: ఇక్కడ జరుగుతున్న ఐసిసి ఒక రోజు క్రికెట్ ప్రపంచకప్ 20వ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. ఆస్ట్రేలియాతో తలపడుతున్న శ్రీలంక జట్టు ఆట నిలిచిపొయే సమయానికి 32.5 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 146 పరుగలు చేసింది. తారంగ్ ఆరు పరుగులు, దిల్షన్ నాలుగు, జయవర్దనే 23 పరుగులు చేసి అవుటయ్యారు. సంగక్కర 73 పరుగులు, సమరవీర 34 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. లీ, టైట్ చెరో వికెట్ తీసుకున్నారు.
Comments