నెదర్లాండ్స్ పై ఐర్లాండ్ విజయం
కోల్'కతా,మార్చి 18: ప్రపంచ కప్ క్రికెట్ లో గ్రూప్-బి 37వ మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టుపై ఐర్లాండ్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లకు 306 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ 47.4 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 307 పరుగులు చేసి విజయం సాధించింది. ఐర్లాండ్ జట్టులో పిఆర్ స్టిర్లింగ్ 101 పరుగులు, పోర్టర్ ఫీల్డ్ 68, జోయ్స్ 28, విల్సన్ 27 పరుగులు చేశారు. నీల్ ఒబ్రియాన్ 57 పరుగులు, కెవిన్ ఒబ్రియాన్ 15 పరుగులు చేసి నాటౌట్'గా నిలిచారు.
Comments