ర్యాలీగా మాత్రమే మిలియన్ మార్చ్
హైదరాబాద్: మార్చి7: ఈనెల 10 తేదిన తలపెట్టిన మిలియన్ మార్చ్ యధావిధిగా కొనసాగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. అయితే పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా, విద్యార్థులు, తల్లితండ్రుల కోరిక మేరకు మిలియన్ మార్చ్ సమయంలో మార్పులు చేశామని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామని ఆయన అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి ట్యాంక్ బండ్ వరకు మిలియన్ మార్చ్ ర్యాలీని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌పై ధర్నా నిర్వహిస్తామని, తెలంగాణ వాదులందరూ పాల్గొనాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. కాగా, ‘మిలియన్ మార్చ్’కు అనుమతి లేదని హైదరబాద్ నగర పోలీస్ కమీషనర్ ఏకే ఖాన్, సైబరాబాద్ కమిషనర్ తిరుమల రావు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటం, సభలు, ర్యాలీలను నిర్వహించడంపై నిషేదాజ్ఞలు విధించారు. పోలీసులు జారీ చేసిన నిషేదాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments