వెస్టిండీస్‌పై భారత్ గెలుపు: క్వార్టర్స్ లో ఆసీస్‌తో పోరు
చెన్నై,మార్చి 20: ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై భారత్ 80 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటయింది. యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించగా, కొహ్లి అర్థ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. మిగతా ఆటగాళ్లెవరూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. గంభీర్ 22, ధోనీ 22, యూసఫ్ పఠాన్ 11, సచిన్ 2, రైనా 4, హర్భజన్ 3, జహీర్ ఖాన్ 5, అశ్విన్ 10 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో రామ్‌పాల్ 5, రసెల్ 2 వికెట్లు పడగొట్టారు. సామీ, బిషూ, పొలార్డ్ తలో వికెట్ తీశారు. తరువాత వెస్టిండీస్ 43 ఓవర్లలో 188 పరుగులకు ఆలవుట్ అయింది. జహీర్ ఖాన్ 3 వికెట్లు తీసుకోగా, అశ్విన్, యువరాజ్ రెండేసి వికెట్లు, హర్ భజన్,రైనా ఒక్కొక్క వికెట్ తీశారు. కాగా, ఆరు పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరిన విండీస్.. పాక్‌తో పోరుకు సిద్ధమైంది.

Comments