ఎలిజబెత్ టేలర్ కన్నుమూత
లాస్‌ఏంజెలెస్ ,మార్చి 23 : హాలీవుడ్ సీనియర్ నటి ఎలిజబెత్ టేలర్ (79) బుధవారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 20 శతాబ్దపు మేటి నటుల్లో ఒకరిగా పేరు గాంచిన టేలర్ రెండు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. నేషనల్ వెల్వెట్, క్లియోపాత్ర, హూజ్ ఎఫ్‌రైడ్ ఆఫ్ వర్జినీయా వూల్ఫ్? లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తన ఏడుగురు భర్తల్లో ఒకరయిన రిచర్డ్ బర్టన్‌తో సమానంగా ఇమేజ్ సంపాదించారు. 1950-60 దశకంలో హాలీవుడ్‌లో ఆమె ఒక వెలుగు వెలిగారు.

Comments