వా...చందా...మామ...
హైదరాబాద్,మార్చి 19: ఆకాశంలో శనివారం భూమికి అతి దగ్గరగా వచ్చిన చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు. విశాఖలో సాయంత్రం 5.30 గంటలకు సూపర్ మూన్ కనిపించింది. విశాఖ సముద్రం వద్ద అధిక సంఖ్యలో జనం గుమిగూడి జాబిల్లి కాంతులను వీక్షించారు. భూమికి అతి దగ్గరగా రావడంతో చంద్రుడు ప్రతిరోజూ కనిపించే పరిమాణం కంటే పెద్దగా కనిపించాడు. కాంతి కూడా ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించింది. హైదరాబాద్ లో సాయంత్రం 6.27కు కొత్త కాంతులు కురిపించాడు. . కాగా, రాష్ట్రంలో పలు చోట్ల శనివారం సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. నెల్లూరు జిల్లా మైపాడు వద్ద సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం 27 అడుగుల ముందుకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ బీచ్ రోడ్‌లోనూ సముద్ర అలలు భీతి గొల్పుతున్నాయి. దీంతో 25-30 అడుగుల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. అలల ఉధృతి పెరగడానికి సూపర్‌మూన్ ప్రభావమే కారణమని భావిస్తున్నారు.

Comments